సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 16:
రైతు బీమా పథకం కొనసాగేందుకు ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆగస్టు 13 నాటికి పాలసీ గడువు ముగిసినట్లు వార్తలు రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రైతు కుటుంబాలకు నష్టం కలగకుండా తక్షణమే బీమా కొనసాగించాలని కోరారు.ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి స్పందించి వెంటనే ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే మృతి చెందిన రైతుల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి ‘మేధో నక్సల్స్’ అంటూ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని శ్రీనివాస్ అన్నారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేసే ప్రయత్నంగా భావిస్తున్నామని, ఆ పదాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును గౌరవించాలని కోరారు.

