Homeతెలంగాణఖమ్మంనిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న తుంబూరు దయాకర్ రెడ్డి

నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న తుంబూరు దయాకర్ రెడ్డి

 

ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 16:

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు ప్రద్యుమ్నచారి కుమార్తె నవ్యసాయి వెంకట నాగ సాయికుమార్ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఖమ్మం ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని అశోక ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి హాజరై కాబోయే వధూవరులు నవ్యసాయి, వెంకట నాగసాయికుమార్‌లను ఆశీర్వదించారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిన అనిత, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్, బాణాల లక్ష్మణ్, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు నూకల రామ్మోహన్ రెడ్డి, కళ్లెం శేషిరెడ్డి, అక్కినేపల్లి దేవయ్యచారి తదితరులు పాల్గొని కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular