గూడెంకొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 21: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ దొడ్డికొండ గ్రామానికి చెందిన పాస్టర్లు మర్రి మోషే, మర్రి ఇమ్మానుయేల్ తండ్రి మర్రి సుబ్బారావు భౌతికకాయాన్ని జిల్లా వైసీపీ కోశాధికారి, దామనపల్లి మాజీ సర్పంచ్ కుందేరి రామకృష్ణ శుక్రవారం సందర్శించి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మర్రి సుబ్బారావు జీవితాంతం గొప్పగా జీవించారని, ఆయన జీవితం అనేకమందికి ఆదర్శప్రాయమని అన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. పాస్టర్లు మోషే, ఇమ్మానుయేల్‌లను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో పీసా సభ్యుడు సీందేరి కర్రయ్య, నాయకులు రాజారావు, పాస్టర్ మార్క్, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
మర్రి సుబ్బారావుకు కుందేరి రామకృష్ణ ఘన నివాళి
RELATED ARTICLES

