Homeతెలంగాణఖమ్మంలక్ష్మి కుటుంబానికి సురేష్ నాయక్ భరోసా

లక్ష్మి కుటుంబానికి సురేష్ నాయక్ భరోసా

 

ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 16:

రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామ వార్డు మెంబర్ అజ్మీర గణేష్ మాతృమూర్తి అజ్మీర లక్ష్మి దశదిన కర్మ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు భూక్యా సురేష్ నాయక్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన సురేష్ నాయక్, వారికి మనోధైర్యం కల్పిస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తమ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు అక్కినేపల్లి దేవయ్యాచారి, బానోత్ శివ, భద్రాచారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular