Homeతెలంగాణసర్వసభ్య సమావేశానికి హాజరు కావాలి: ఎంపీడీవో మంగమ్మ

సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలి: ఎంపీడీవో మంగమ్మ

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 19:

మహబూబాబాద్ జిల్లా గార్ల మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో గురువారం మండల ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మంగమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారి జి. దేశీరాం నాయక్‌ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుందని, ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. మండలానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, పరిపాలనా అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలం లో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular