Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన - ప్రధాని మోదీ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన – ప్రధాని మోదీ

 

 

 

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన

– ప్రధాని మోదీ

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 1 : ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేసారు. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727 కోట్ల వ్యయంతో 2,703 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

3,800 మీటర్ల పొడవైన రన్‌వేతో భారీ విమానాలు సైతం సులభంగా రాకపోకలు సాగించే సామర్థ్యం ఈ విమానాశ్రయానికి ఉంది. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా నిర్మించగా, భవిష్యత్తులో ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే స్థాయికి విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో కార్గో, లాజిస్టిక్స్, పర్యాటకం, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. విమానాశ్రయం నుంచి సాధారణ విమాన సర్వీసులు ఈ నెల 17 అర్థరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular