Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంభోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర ప్రగతికి గేమ్‌చేంజర్: ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర ప్రగతికి గేమ్‌చేంజర్: ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

 

 

 

భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర ప్రగతికి గేమ్‌చేంజర్:

ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం
/పెందుర్తి, ఆగస్టు 1: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు పేర్కొన్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభమైన సందర్భంగా ఆయన మాట్లాడారు.

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి పెందుర్తి నియోజకవర్గం నుంచి 8 వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ఉదయం ఐదు గంటలకు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రజలు సమయానికి కార్యక్రమ వేదికకు చేరుకునేలా స్వయంగా పర్యవేక్షించినట్లు చెప్పారు. కార్యక్రమానికి హాజరైన వారికి అల్పాహారం, టీ, భోజన వసతులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృహత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెందుర్తి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఎంతోకాలంగా ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ లోటు భర్తీ అయ్యిందన్నారు. భోగాపురం విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పరిశ్రమలు పెరిగి ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, వలసలు తగ్గి అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2016లోనే చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం, అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చొరవతో భోగాపురం విమానాశ్రయానికి శ్రీకారం చుట్టిందని, అనంతరం వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో తక్కువ సమయంలోనే విమానాశ్రయం నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధమైందని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేలా వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ప్రజలు ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులుగా నిలవడం అదృష్టంగా భావించాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular