శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తులసి దళార్చన నిర్వహణ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 1: నగరంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి శనివారం నిర్వహించే ప్రత్యేక తులసి దళార్చన కార్యక్రమాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ప్రత్యేక సేవలో ఇద్దరు ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

