Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నండీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు,...

డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు

✒️

విశాఖ ఉత్తరంలో ముగిసిన రిలే నిరాహార దీక్షలు

డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు

సత్యం జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ మానవహారం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగష్టు 8: విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలతో పాటు డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని సత్యం జంక్షన్‌ వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారంతో ముగిశాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగాయి.

మూడో రోజు నలభై ఏడో, నలభై ఎనిమిదో, నలభై తొమ్మిదో, యాభైవ, యాభై ఒకటో, యాభై రెండో, యాభై మూడో, యాభై నాలుగో, యాభై ఐదో వార్డులకు చెందిన నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దీక్షను కె.కె. రాజు ప్రారంభించారు. అనంతరం దీక్షలో పాల్గొన్న అల్లుశంకర్‌రావు, రేయ్యి వెంకటరమణ, వావిలపల్లి ప్రసాద్‌, భర్కట్‌ ఆలీ, గుజ్జు వెంకట్‌రెడ్డి, సుకుమార్‌, డోప్ప శ్రీను, ఐ. రవికుమార్‌, వేణు ధమయంతి, ఎర్రంశెట్టి శ్రీను, కె.వి. బాబా, షేక్‌ బాబ్జి, పి. ఈశ్వరి, చందు, కొరిబిల్లి చందు, తాటిపూడి రత్నం, సొండి సురేష్‌, శివరాం, విమల్‌లకు కె.కె. రాజు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

ఈ సందర్భంగా కె.కె. రాజు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించడంతో పాటు నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలుగా ఉన్న సుమారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు చేపడుతుంటే ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని విమర్శించారు.

శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల ఒత్తిడితో దౌర్జన్యాలు, అరెస్టులు, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అని, ఆ హక్కును అణచివేయాలని చూస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భయపడబోదని స్పష్టం చేశారు. అధికార, పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు పోలీసులు లోబడకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

దీక్షల అనంతరం సత్యం జంక్షన్‌ వద్ద విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ మానవహారం నిర్వహించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపమేయర్‌ కటుమూరి సతీష్‌, నియోజకవర్గ పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, పెడాడ రమణికుమారి, ప్రచార విభాగం జోన్‌ ఒకటి అధ్యక్షులు రవిరాజు, మాజీ కార్పొరేటర్లు అనిల్‌కుమార్‌ రాజు, పద్మారెడ్డి, కె.వి.ఎన్‌. శశికళ, పామేటి బాబ్జి, వార్డు అధ్యక్షులు బొడేటి కిరణ్‌, రాష్ట్ర, జోనల్‌, జిల్లా, నియోజకవర్గ నాయకులు దేముడుబాబు మాస్టర్‌, కిరణ్‌రాజు, తాడి జగన్నాథరెడ్డి, దుప్పలపూడి శ్రీనివాస్‌, అంబటి శైలేష్‌, ఎం. సునీల్‌, బయవరపు రాధా, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

అలాగే నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వార్డు పరిశీలకులు, వివిధ వార్డుల సీనియర్‌ నాయకులు, జిల్లా నాయకులు, వార్డు ఉపాధ్యక్షులు, సచివాలయ అధ్యక్షులు, బూత్‌ కన్వీనర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular