పులి కనిపించిందంటూ తప్పుడు సమాచారం.. వ్యక్తిపై క్రిమినల్ కేసు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆరిలోవ ఆగష్టు 10: పులి కనిపించిందంటూ తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఆరిలోవ సీఐ శ్రీనివాస్ తెలిపారు. తప్పుడు సమాచారంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పులి సంచరిస్తోందంటూ వచ్చిన సమాచారాన్ని పోలీసులు పరిశీలించగా, అది వాస్తవం కాదని నిర్ధారణ అయినట్లు తెలిపారు. బాధ్యతారహితంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు.

