Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుజీసీసీ విశ్రాంత ఉద్యోగి శరభన్న పడాల్‌ కన్నుమూత

జీసీసీ విశ్రాంత ఉద్యోగి శరభన్న పడాల్‌ కన్నుమూత

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగష్టు 11:గిరిజన సహకార సంస్థ (జీసీసీ) విశ్రాంత ఉద్యోగి కంకిపాటి శరభన్న పడాల్‌ (64) సోమవారం రాత్రి తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందారు. ఉద్యోగరీత్యా గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహించిన ఆయన గిరిజనుల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించారు.శరభన్న పడాల్‌ మృతి పట్ల పలువురు గిరిజన సంఘాల నాయకులు, జీసీసీ సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంగళవారం గూడెం కొత్తవీధి మండలం పెదవలస గ్రామంలో శరభన్న పడాల్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular