Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంభీమిలిలో బెల్ట్ షాపులపై పోలీసుల మెగా దాడులు 6 మంది అరెస్ట్ – 55 మద్యం...

భీమిలిలో బెల్ట్ షాపులపై పోలీసుల మెగా దాడులు 6 మంది అరెస్ట్ – 55 మద్యం బాటిళ్లు స్వాధీనం

 

 

భీమిలిలో బెల్ట్ షాపులపై పోలీసుల మెగా దాడులు

6 మంది అరెస్ట్ – 55 మద్యం బాటిళ్లు స్వాధీనం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం,
భీమిలి, ఆగస్టు 6: పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దివాకర్ యాదవ్ ఆదేశాల మేరకు రాబడి సమాచారం ఆధారంగా భీమిలి పోలీసులు గురువారం బెల్ట్ షాపులపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మొత్తం 55 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంటస్తంభం ప్రాంతానికి చెందిన అమరాన నూకరాజు వద్ద నుంచి 6 బాటిళ్లు, ఎగువపేటకు చెందిన కారి నర్సి నర్సియ్యమ్మ వద్ద నుంచి 8 బాటిళ్లు, పుక్కల్లా దాసు వద్ద నుంచి 14 బాటిళ్లు, చిన్న బజారుకు చెందిన జల్లలమూడి జయకృష్ణ వద్ద నుంచి 9 బాటిళ్లు, సంగివలసకు చెందిన కనగళ్ల మసేను వద్ద నుంచి 11 బాటిళ్లు, కోడిమాలి రాజు వద్ద నుంచి 7 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై ఎక్సైజ్ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా సి.ఐ దివాకర్ యాదవ్ మాట్లాడుతూ, అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular