- పాడేరు, పెన్ పవర్, సెప్టెంబర్ 2: పాడేరు పట్టణంలోని వీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లను జనసేన పార్టీ పాడేరు ఇంచార్జ్, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య పర్యవేక్షించారు.వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లపై ఆయన పార్టీ నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో గొర్ల వీర వెంకట్, అశోక్, రామ్మూర్తి, కొయ్యంబాలు సిద్దు తదితరులు పాల్గొన్నారు.
పాడేరులో పవన్ జన్మదిన వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు
RELATED ARTICLES

