బాపట్ల , సెప్టెంబర్ 19 (పెన్ పవర్):
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (ఏపీసీసీ) పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించారు. ఏపీసీసీ ఇన్‌చార్జి, కర్ణాటక ఎమ్మెల్సీ పి.వి. మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కమిటీ సభ్యులు చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు రాజకీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

