Homeఆంధ్రప్రదేశ్కాకినాడఆలయ వ్యవహారంపై రాజకీయాలు వద్దు

ఆలయ వ్యవహారంపై రాజకీయాలు వద్దు

రామచంద్రపురం, పెన్ పవర్,సెప్టెంబర్ 19: ద్రాక్షారామం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వ్యవహారాన్ని రాజకీయంగా మార్చి మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై వైఎస్సార్‌సీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కూటమి నాయకులు ఆరోపించారు. రామచంద్రపురంలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, క్లస్టర్-2 ఇన్‌చార్జి కంచుమర్తి బాబురావు మాట్లాడారు.2022లోనే ధూపదీప నైవేద్యానికి సంబంధించి దేవాదాయ శాఖలో ప్రక్రియ జరిగినట్లు అధికారిక రికార్డులు సూచిస్తున్నాయని రిష్వంత్ రాయ్ తెలిపారు. అప్పట్లో ప్రశ్నించని అంశాన్ని ఇప్పుడు రాజకీయంగా ఉపయోగించడం సరికాదన్నారు. ఆలయాలు, భక్తుల విశ్వాసాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రశేఖర్, బాబురావు సూచించారు. దేవుని సన్నిధిలో కుల, వర్గ రాజకీయాలకు తావులేదని, ప్రజల మనోభావాలతో ఆటలాడవద్దని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular