Homeఆంధ్రప్రదేశ్బాపట్లఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయానికి ‘ప్యారడైజ్’ మూవీ టీం

ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయానికి ‘ప్యారడైజ్’ మూవీ టీం

హీరో నానితో పాటు చిత్ర బృందం రాక.. నాయకులు, కార్యకర్తలకు ఆహ్వానం

పర్చూరు, సెప్టెంబర్ 30: ‘ప్యారడైజ్’ సినిమా బృందం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పర్చూరులోని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయాన్ని సందర్శించనుంది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమం అనంతరం ఒంగోలు వెళ్లే క్రమంలో హీరో నాని, చిత్ర బృందం కొద్దిసేపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆగనున్నట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

సినిమా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన కొనసాగనుంది. నాగండ్లకు చెందిన చెరుకూరి సుధాకర్ ‘ప్యారడైజ్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. హీరో నాని, చిత్ర బృందం క్యాంపు కార్యాలయానికి రానున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular