పర్చూరు, సెప్టెంబర్ 29 : పాఠశాల విద్యా కమిటీల ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా 237 పాఠశాల గాను ఒక పాఠశాల లో ఎన్నిక వాయిదా పడగా 231 మంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, చిన్నగంజాం, ఇంకొల్లు, మార్టూరు మండలాల్లోని పాఠశాలల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గణనీయ సంఖ్యలో గెలుపొందారు.
పర్చూరు మండలంలో 45 పాఠశాలలకు గాను 44 చోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. చెరుకూరు పాఠశాలలో ఎన్నిక వాయిదా పడింది. యద్దనపూడి మండలంలో 33కు 32, కారంచేడు మండలంలో 31కు 28, చిన్నగంజాం మండలంలో 37కు 37, ఇంకొల్లు మండలంలో 37కు 36, మార్టూరు మండలంలో 54కు 54 మంది టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు.
నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిటీ సభ్యులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభినందించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలతోపాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

