Homeఆంధ్రప్రదేశ్బాపట్లరైతులకు సబ్సిడీపై యూరియా, డీఏపీ చల్లారెడ్డిపాలెం సచివాలయానికి చేరిన ఎరువులు

రైతులకు సబ్సిడీపై యూరియా, డీఏపీ చల్లారెడ్డిపాలెం సచివాలయానికి చేరిన ఎరువులు

వేటపాలెం, సెప్టెంబర్ 30 : మండలంలోని చల్లారెడ్డిపాలెం గ్రామ రైతులకు శుభవార్త. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సూచనల మేరకు, చల్లారెడ్డిపాలెం పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కీర్తి పూర్ణ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై అందించేందుకు యూరియా, డీఏపీ ఎరువులు చల్లారెడ్డిపాలెం సచివాలయానికి చేరాయి.

అవసరమైన రైతులు ఆధార్ కార్డు, పొలం సంబంధిత పత్రాల జిరాక్స్ ప్రతులతో చల్లారెడ్డిపాలెం సచివాలయంలోని వ్యవసాయ సహాయకుడిని సంప్రదించి ఎరువులు పొందాలని నిర్వాహకులు కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular