2026-27 విద్యా సంవత్సరానికి బాధ్యతలు చేపట్టనున్న వేటపాలెం పీఈటీ
వేటపాలెం, సెప్టెంబర్ 19 (పెన్ పవర్):
2026-27 విద్యా సంవత్సరానికి బాపట్ల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జిల్లా కార్యదర్శిగా వేటపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న జరుబుల శ్రావణి ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి. శ్రీనివాస్ సింగ్ శుక్రవారం ధ్రువీకరించారు.
ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయిని దేవరకొండ సరోజిని శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయిని శ్రావణిని ఘనంగా సత్కరించి అభినందించారు. పాఠశాల స్టాఫ్ సెక్రటరీ కె. సోమశేఖర్, పీడీ జె. దేవబిక్షం, ఇతర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు జరుబుల శ్రావణి ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె పదవీకాలంలో జిల్లా స్థాయిలో క్రీడా అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

