Homeఆంధ్రప్రదేశ్బాపట్లస్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం

స్వచ్ఛతతోనే ఆరోగ్యకర సమాజం

ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలి

సమిష్టి కృషితో స్వచ్ఛ చీరాల సాధ్యం: ఎమ్మెల్యే మాలకొండయ్య

చీరాల, సెప్టెంబర్ 19 (పెన్ పవర్):

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీరాలలోని చిన్నపిల్లల పార్క్‌లో శనివారం స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. ఇళ్లు, వీధులు, పార్కుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా కృషి చేస్తే స్వచ్ఛ చీరాలను సాధించవచ్చని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular