Homeఆంధ్రప్రదేశ్బాపట్లఘనంగా గాయత్రి పీఠం పరివార్ ఆధ్వర్యంలో వినాయక వేడుకలు

ఘనంగా గాయత్రి పీఠం పరివార్ ఆధ్వర్యంలో వినాయక వేడుకలు

ఈపురుపాలెం, సెప్టెంబర్ 19 (పెన్ పవర్):

చీరాల గాయత్రి పీఠం పరివార్ ఆధ్వర్యంలో ఈపురుపాలెం పంచాయతీ పరిధిలోని వీర రాఘవుల స్వామి వీధిలో వినాయకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీరాల మండల జడ్పీటీసీ బండ్ల తిరుమలాదేవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు నాలుగు వేల దేవాలయాలకు సంబంధించిన మన్ను, తీర్థాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా తొలి కలశాన్ని జడ్పీటీసీ బండ్ల తిరుమలాదేవికి అందజేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో గాయత్రి పీఠం పరివార్ పెద్దలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular