Homeఆంధ్రప్రదేశ్పోలవరంగుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

చింతూరు పెన్ పవర్, సెప్టెంబర్ 11:

చింతూరు మండలం సింగన్నగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చింతూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular