Homeతెలంగాణహైదరాబాద్ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

 

ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 11:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం నందు అర్థశాస్త్ర అధ్యాపకుడికి 2026 సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాధిక అధ్యక్షతన కళాశాలలో ఉత్తమ ఉపాధ్యాయుడిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాలకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా సంతోషదాయకమని, ఈ అవార్డు రావడం వల్ల కళాశాల రాష్ట్రస్థాయిలో పేరుపొందిందని ఆమె కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని, ఈ అవార్డు రావడం పట్ల డాక్టర్ రమేష్ ని ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంఘ అధ్యక్షుడు ప్రొఫెసర్ సంగీ రమేష్ మాట్లాడుతూ ఈ అవార్డు రావడం వల్ల ఉపాధ్యాయుల మీద బాధ్యత ఇంకా పెరుగుతుందని భవిష్యత్తులో ఈ కళాశాల అభివృద్ధికి అందరూ పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్ బండి రాజు, ప్రొఫెసర్ సురేష్, జి.సిటిఏ సెక్రటరీ డాక్టర్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సివి పవన్ కుమార్, సురేష్ డాక్టర్ ఏ రచన, డాక్టర్ డివి రావు, వీరారెడ్డి, హృదయ రాజు, డిఎస్ఎస్ఆర్ కృష్ణ, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ సురేఖ, డాక్టర్ నీలిమ, కరుణ, డాక్టర్ శంకర్, నరేందర్ రెడ్డి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular