- కొత్త విధానంతో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తప్పవంటున్న వైసీపీ నేత
- ముంచంగిపుట్టు, పెన్ పవర్, సెప్టెంబర్ 23:సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని గతంలో మాదిరిగానే కొనసాగించాలని ముంచంగిపుట్టు మండల వైసీపీ అధ్యక్షుడు పాంగి పద్మారావు ప్రభుత్వాన్ని కోరారు.బుధవారం ఆయన మాట్లాడుతూ.. పింఛన్ పంపిణీ విధానంలో మార్పుల కారణంగా వృద్ధులు, దివ్యాంగులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో లేని లబ్ధిదారులకు ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.పింఛన్ మొత్తాన్ని గతంలో మాదిరిగానే పూర్తిగా లబ్ధిదారుల ఇంటి వద్దే అందజేయాలని పద్మారావు డిమాండ్ చేశారు. వృద్ధులు, దివ్యాంగులను బ్యాంకుల చుట్టూ తిప్పకుండా ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విధానంపై పునరాలోచించాలని కోరారు.
పింఛన్ల పంపిణీ పాత విధానంలోనే కొనసాగించాలి
RELATED ARTICLES

