Homeఆంధ్రప్రదేశ్పోలవరంభారీ వర్షాలు, వరదలపై ఐటీడీఏ అప్రమత్తం

భారీ వర్షాలు, వరదలపై ఐటీడీఏ అప్రమత్తం

చింతూరు, పెన్ పవర్, సెప్టెంబర్ 24:

చింతూరు డివిజన్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నోఖ్వాల్, ఐఏఎస్‌ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గురువారం వీఆర్‌పురం తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు, రహదారులు, వంతెనలు, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలపై సమీక్షించారు. ప్రతి మండలంలో అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌ల ద్వారా సమాచారం సేకరించి అత్యవసర పరిస్థితుల్లో శాఖల మధ్య సమన్వయంతో వెంటనే స్పందించాలన్నారు. గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం అన్నవరం వంతెనను పరిశీలించి నీటి ప్రవాహం, రహదారి పరిస్థితులను పరిశీలించారు. కునవరం వంతెన వద్ద సబరి గోదావరి సంగమ ప్రాంతంలో నీటిమట్టాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కునవరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు నదులు, వాగులు, వరద నీరు ప్రవహించే ప్రాంతాల్లో అనవసరంగా ప్రయాణించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular