Homeఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరివినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ డి.నరసింహ కిషోర్

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ డి.నరసింహ కిషోర్

రాజమహేంద్రవరం, పెన్ పవర్, స్టాఫ్ రిపోర్టర్, సెప్టెంబర్ 13:
తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పర్యావరణానికి అనుకూలమైన మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని జిల్లా ప్రజలకు సూచించారు.
జిల్లాలో వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని, పోలీసు శాఖ సూచనలు, భద్రతా నిబంధనలు పాటిస్తూ జిల్లా పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సకల శుభాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular