బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖుల సందడి..
జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటంతో ప్రత్యేక ఆకర్షణ
తాళ్ళపూడి, పెన్ పవర్, సెప్టెంబర్ 17:
తాళ్లపూడి గ్రామంలో బండ్రెడ్డి కుటుంబానికి చెందిన హర కార్తికేయ వేంకట్రాయుడు తొలి పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారిని ఆశీర్వదించడంతో బండ్రెడ్డి వారి స్వగృహం సందడిగా మారింది. చిన్నారి తొలి జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. బాలుడి తాతయ్య, నానమ్మ బండ్రెడ్డి వేంకటేశ్వరరావు, వరలక్ష్మి, అమ్మమ్మ, తాతయ్య పోసిన శ్రీకృష్ణదేవరాయుడు, కృష్ణవేణి ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల కోసం మధ్యాహ్నం 12 గంటలకు విందు ఏర్పాటు చేశారు. పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన అతిథులు చిన్నారి హర కార్తికేయ వేంకట్రాయుడికి పుష్పగుచ్ఛాలు అందజేసి, ఆశీర్వదించారు.

బాలుడి తల్లిదండ్రులు సూర్యహరితేజ, జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీలేఖతో పాటు కుటుంబ సభ్యులు సుహాష్, సుష్మ, మణిప్రతాప్, పద్మిని, నాగార్జున, అవిల, సుభాష్ చంద్రబోస్, అలేఖ్య తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీలేఖకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ప్రతిబింబించేలా వేడుకల్లో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముందుగా జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చిన్నారికి ఆశీస్సులు ఇప్పించిన అనంతరం ఆయన చిత్రపటాన్ని పుట్టినరోజు వేడుకల్లో ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలకు వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కవురు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సింహాద్రి జనార్ధనరావు, నాయకులు బండి అబ్బులు, రుత్తుల భాస్కరరావు, కుంటముక్కల కేశవనారాయణ, కాకర్ల వెంకటేశ్వరరావు, పిట్టా శ్రీనివాస్, ముదునూరి నాగరాజు, వంబోలు పోసిబాబు, నామా ప్రకాశం, గూడా విజయరాజు, మారిన రామకృష్ణ, చిట్టూరి అన్నవరం తదితరులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ ప్రముఖుల రాకతో వేడుకల ప్రాంగణం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. హర కార్తికేయ వేంకట్రాయుడు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అతిథులు ఆకాంక్షించారు.

