చీరాల, అక్టోబరు 4 : చీరాల డీఎస్పీ మొహమ్మద్ మోహిన్ సూచనల మేరకు విజిలిపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఒకటో పట్టణ సీఐ సోమశేఖర్, రెండో పట్టణ సీఐ శశికుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు ఎస్సైలు, 65 మంది సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను గుర్తించారు. ఆర్‌సీ, బీమా, పీయూసీ తదితర పత్రాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గంజాయి, నాటుసారా, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

