బాపట్ల, అక్టోబరు 4 : బాపట్ల జిల్లా పోలీస్ శాఖలోకి బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన ‘హంటర్’ నూతన పోలీస్ జాగిలం చేరింది. గంజాయి, ఇతర మత్తుపదార్థాలను గుర్తించడంతో పాటు నేరస్థుల ఆనవాళ్లను గుర్తించేలా 11 నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన హంటర్ ఇకపై జిల్లాలో సేవలు అందించనుంది. రైళ్లు, వాహనాల తనిఖీలు, కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లలో హంటర్ సేవలను వినియోగించనున్నారు. ‘ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా మత్తుపదార్థాల అక్రమ రవాణాపై నిఘాను మరింత పటిష్టం చేయనున్నారు.

