వేటపాలెం, అక్టోబరు 4 : స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వేటపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పందిళ్లపల్లి–1 అంగన్వాడీ కార్యకర్త పుప్పాల పద్మ స్వచ్ఛ అంగన్వాడిగా ఎంపికయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశుభ్రంగా నిర్వహిస్తూ స్వచ్ఛత ప్రమాణాలు పాటించినందుకు ఈ అవార్డు లభించింది. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సువర్ణ, సూపర్‌వైజర్ సజ్జా పుష్పవల్లి తదితరులు పాల్గొన్నారు. పద్మకు అవార్డు రావడంపై సీడీపీఓ టి. ఝాన్సీ అభినందనలు తెలిపారు.

