చీరాల, అక్టోబర్ 4 : బీచ్‌కు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం నిర్మిస్తున్న డ్రెస్సింగ్ రూములు, పబ్లిక్ టాయిలెట్లు, వాష్‌రూమ్‌ల నిర్మాణ పనులను చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించి, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.

