Homeఆంధ్రప్రదేశ్గుమ్మలగొందిలో పూజారి లీలాప్రసాద్‌ విస్తృత ప్రచారం

గుమ్మలగొందిలో పూజారి లీలాప్రసాద్‌ విస్తృత ప్రచారం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 31: గూడెంకొత్తవీధి-1 వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పూజారి లీలాప్రసాద్ గుమ్మలగొంది గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికి తమ మద్దతు ప్రకటించారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా గ్రామస్థులు కోరారు. అనంతరం అయన మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అవకాశం కల్పించి, అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular