Homeఎడిటోరియల్వృద్ధులు, అభాగ్యులకు సేవలందించాలి: చెరుకు సుధాకర్

వృద్ధులు, అభాగ్యులకు సేవలందించాలి: చెరుకు సుధాకర్

హయత్‌నగర్‌లో దయ ఓల్డ్ ఏజ్ హోమ్, రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభం

వృద్ధులు, అభాగ్యులకు సేవలందించాలి: చెరుకు సుధాకర్

ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 1:

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని జనగామ మానస నేతృత్వంలో రూపుదిద్దుకున్న దయ ఓల్డ్ ఏజ్ హోమ్ మరియు రిహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు డాక్టర్ చెరుకు సుధాకర్… తెలంగాణ కల్లు గీత పారిశ్రామిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సేవా కేంద్రాల ద్వారా అనేక సేవలు అవసరమని, ప్రాధాన్యతను వివరించారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న మెనింజైటిస్ అనంతర సమస్యలతో పాటు క్రేనియోటమీ శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న యువతిని పరామర్శించి, ఆమెకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వైద్య సేవల కొనసాగింపుపై పలు సూచనలు చేశారు. వృద్ధులు, అనాథలు, అభాగ్యులు ఎవరూ దయనీయ పరిస్థితుల్లో ఉండకుండా ఈ కేంద్రం ద్వారా నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ధర్మభిక్షం కుమారుడు బొమ్మగాని ప్రభాకర్ గౌడ్, జనగామ మానస కుటుంబ సభ్యులు, ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular