Homeఆంధ్రప్రదేశ్ప్రచార బరిలో ప్రత్యర్థులు.. పలకరింపుల్లో ఆత్మీయులు!

ప్రచార బరిలో ప్రత్యర్థులు.. పలకరింపుల్లో ఆత్మీయులు!

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 30:స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో జీకే వీధి–3 ఎంపీటీసీ అభ్యర్థుల ఆత్మీయ కలయిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొబ్బిలి లక్ష్మణ్, స్వతంత్ర అభ్యర్థి శెట్టి నాగేశ్వరరావు ప్రచారంలో ఎదురుపడి పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరి పార్టీ కరపత్రాలను మరొకరు అందజేసుకుంటూ స్నేహభావాన్ని చాటుకున్నారు. ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా పరస్పర గౌరవం, ఆప్యాయతలను కొనసాగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. రాజకీయ పోటీలు ఉన్నా వ్యక్తిగత సంబంధాలు, మానవీయ విలువలు నిలవాలనే మంచి సందేశాన్ని ఈ కలయిక అందించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular