Homeఆంధ్రప్రదేశ్రింతాడలో కూటమి ప్రచార జోరు.. సందడి!

రింతాడలో కూటమి ప్రచార జోరు.. సందడి!

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 31:‘అభివృద్ధి అంటేనే కూటమి ప్రభుత్వం’ అనే నినాదంతో రింతాడ పంచాయతీ పరిధిలోని కడుగుల గ్రామంలో కూటమి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. రింతాడ–2 సెగ్మెంట్ కూటమి ఎంపీటీసీ అభ్యర్థి సాగిన భీమేశ్వర్ పడల్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు.కడుగుల గ్రామానికి చేరుకున్న ఎంపీటీసీ అభ్యర్థులు భీమేశ్వర్ పడల్‌కు పాల్స్ కు స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో కూటమి శ్రేణులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular