గూడెంకొత్తవీధి, పెన్ పవర్,అక్టోబర్ 30:దామనపల్లి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి సాగిన సత్యవతి దొడ్డికొండ గ్రామంలో ఇంటింటా పర్యటించి ఓటర్లను కలుసుకుని మద్దతు కోరారు. తనకు అవకాశం కల్పిస్తే గ్రామాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆమె ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది.
వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి సాగిన సత్యవతి విస్తృత ప్రచారం
RELATED ARTICLES

