అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి
ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ కె. దినేష్ కుమార్
రంపచోడవరం, (పోలవరం బ్యూరో )పెన్ పవర్, అక్టోబర్ 29:
అర్నబ్ తుపాను ప్రభావం, జిల్లాలో చేపట్టిన ముందస్తు చర్యలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ గురువారం రాత్రి కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రజల భద్రతకు తీసుకున్న చర్యలు, పునరావాస కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, అత్యవసర సేవల నిర్వహణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలను కొనసాగించాలని ఈ సందర్భంగా సూచించారు. తుపాను పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తూ, ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు.

