ఈసీఐఎల్‌లో డా.జెర్రీ స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభం
అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 7:
ఉప్పల్ నియోజకవర్గం ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ జెర్రీ స్పెషాలిటీ క్లినిక్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కావాలంటే ఆధునిక సదుపాయాలతో కూడిన ప్రత్యేక వైద్య కేంద్రాల ఏర్పాటు ఎంతో అవసరమని అన్నారు. ఈసీఐఎల్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, అవసరమైన డయాగ్నోస్టిక్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వైద్య సేవలను అందించాలని క్లినిక్ నిర్వాహకులకు సూచించారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక ప్రజలకు సమీపంలోనే వైద్య పరీక్షలు, ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ప్రయోజనకరమని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డితో పాటు క్లినిక్ నిర్వాహకులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

