Homeతెలంగాణబాబురావు సేవలు చిరస్మరణీయం: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

బాబురావు సేవలు చిరస్మరణీయం: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

బాబురావు సేవలు చిరస్మరణీయం

ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 7:

క్రాంతి గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షులు పోలిశెట్టి బాబురావు ప్రథమ వర్ధంతి సందర్భంగా సైనిక్‌పురిలోని ఎం.కె. రావు బ్రిగేడియర్ హాల్‌లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై బాబురావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పోలిశెట్టి బాబురావు సమాజానికి అందించిన సేవలు, చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక సేవ పట్ల ఆయన చూపిన అంకితభావాన్ని స్మరించుకున్నారు. బాబురావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బాబురావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, క్రాంతి గ్రూప్ ప్రతినిధులు, అభిమానులు, పలువురు నాయకులు పాల్గొని బాబురావుకు ఘన నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular