గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 15: గూడెంకొత్తవీధి గ్రామపంచాయతీ ఉమ్మడి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పసుపులేటి నాగమణిని టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. పాడేరు టీడీపీ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ప్రతిపాదనతో నాగమణి ఆదివారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను ఆదరించి గెలిపిస్తే గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

