గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 15: గూడెంకొత్తవీధి మండలంలోని రింతాడ, పెదవలస నామినేషన్ కేంద్రాలను తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు ఆదివారం సందర్శించారు. రింతాడ కేంద్రంలో నాలుగు గ్రామ పంచాయతీలకు, పెదవలస కేంద్రంలో రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత రిటర్నింగ్ అధికారులతో మాట్లాడి నామినేషన్ల స్వీకరణ తీరును అడిగి తెలుసుకున్నారు. రెండు కేంద్రాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని అధికారులు వివరించారు.

