Homeతెలంగాణఅక్రమ బోర్ల నిర్వహణ

అక్రమ బోర్ల నిర్వహణ

అక్రమ బోర్ల నిర్వహణ

నీటి సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారుల హెచ్చరిక

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 10:

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా మండల పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్‌వెల్స్‌, అక్రమంగా బోరు నీటిని సరఫరా చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించిన తనిఖీల్లో రెండు అనుమతి లేని బోర్‌వెల్స్‌తో పాటు, అక్రమంగా నీటి సరఫరా చేస్తున్న తొమ్మిది పైప్‌లైన్లను అధికారులు సీజ్ చేశారు. కాప్రా వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో రెండు అనుమతి లేని బోర్‌వెల్స్‌ను గుర్తించి సీజ్ చేయగా, మాణిక్యేశ్వర నగర్‌లో నాలుగు, ఎల్లారెడ్డిగూడలో నాలుగు, దుర్గానగర్‌లో ఒకటి చొప్పున మొత్తం తొమ్మిది అక్రమ బోరు నీటి సరఫరా పైప్‌లైన్లను సీజ్ చేశారు. ఈ చర్యలను కాప్రా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా బోర్‌వెల్స్‌ ఏర్పాటు చేయడం, అక్రమంగా బోరు నీటిని సరఫరా చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. మండల పరిధిలో అక్రమ బోర్లపై తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular