Homeతెలంగాణమేడ్చల్ మల్కాజ్‌గిరిదోమల నివారణకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

దోమల నివారణకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

దోమల నివారణకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

అశోక్ నగర్‌లో ఎంఎంసీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 20:

ఉప్పల్ నియోజకవర్గం హెచ్‌బీ కాలనీ 19వ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కాలనీలో శుక్రవారం ఎంఎంసీ నాచారం సర్కిల్–8 ఆధ్వర్యంలో దోమల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు కాలనీవాసులకు పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వల తొలగింపు, దోమల వృద్ధిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌బీ కాలనీ 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌకుట్ల రూపేందర్ రెడ్డి, కాలనీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular