Homeఆంధ్రప్రదేశ్కాకినాడశలపాక సర్పంచ్ పోరులో ఉత్కంఠ

శలపాక సర్పంచ్ పోరులో ఉత్కంఠ

 

కూటమి మద్దతుపై శ్రీలక్ష్మి, భాగ్యలక్ష్మి మధ్య పోటీ..

గెలుపెవరిదోనని ఎదురుచూస్తున్న గ్రామస్తులు

కాజులూరు,పెన్ పవర్,నవంబర్ 20:

కాజులూరు మండలం శలపాక గ్రామ సర్పంచ్ ఎన్నిక ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. సర్పంచ్ పదవి కోసం టేకుమూడి భాగ్యలక్ష్మి, పోతుల శ్రీలక్ష్మి బరిలో నిలవడంతో గ్రామంలో ద్విముఖ పోటీ నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో గ్రామంలో రాజకీయ చర్చలు వేడెక్కాయి.

కూటమి తరపున మాజీ సర్పంచ్ పోతుల గనిరాజు భార్య పోతుల శ్రీలక్ష్మి ఎన్నికల బరిలో దిగారు. శుక్రవారం కూటమి నాయకులతో కలిసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయానికి చేరుకున్న ఆమె వాసంశెట్టి సత్యం, పోలిశెట్టి చంద్రశేఖర్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం శ్రీలక్ష్మిని కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి తరపున మరెవరూ అభ్యర్థులు లేరని స్పష్టం చేస్తూ, శ్రీలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మరోవైపు టేకుమూడి శంకర్ భార్య టేకుమూడి భాగ్యలక్ష్మికి కూడా కొందరు కూటమి నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలుపుతూ జనసేన జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. గొల్లపాలెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి చేరుకుని ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ ర్యాలీలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువత రాజకీయ పార్టీల జెండాలు కాకుండా నీలిరంగు జెండాలు పట్టుకుని పాల్గొనడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఒకవైపు కూటమి మద్దతుతో శ్రీలక్ష్మి ప్రచారానికి సిద్ధమవుతుండగా, మరోవైపు భాగ్యలక్ష్మికి లభిస్తున్న మద్దతు రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని పెంచుతోంది. కూటమి నాయకత్వం శ్రీలక్ష్మి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా బలపరచడంతో శలపాకలో ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఇద్దరిలో గ్రామస్థులు ఎవరికి పట్టం కడతారోనని స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular