Homeతెలంగాణహైదరాబాద్ప్రభుత్వ కొనుగోళ్లలో గిరిజన వ్యాపారులకు కొత్త అవకాశాలు

ప్రభుత్వ కొనుగోళ్లలో గిరిజన వ్యాపారులకు కొత్త అవకాశాలు

ప్రభుత్వ కొనుగోళ్లలో గిరిజన వ్యాపారులకు కొత్త అవకాశాలు

జీ.ఈ.ఎం పోర్టల్‌తో టిక్కి అవగాహన ఒప్పందం

హైదరాబాద్ పెన్ పవర్ , నవంబర్ 20:

గిరిజన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు ప్రభుత్వ కొనుగోళ్లలో అవకాశాలను విస్తరించేందుకు ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిక్కి) కీలక ముందడుగు వేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జిఈఎం ) పోర్టల్‌తో టిక్కి సంస్థ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై టిక్కి వ్యవస్థాపక అధ్యక్షుడు సుధాకర్ ధారావత్, జనరల్ సెక్రటరీ బసంత్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా టిక్కి సభ్యులైన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న తరహా వ్యాపార సంస్థలకు ప్రభుత్వ కొనుగోళ్ల విధానంపై అవగాహన కల్పించడంతో పాటు, జీఈఎం పోర్టల్ ద్వారా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించనున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రభుత్వ కొనుగోళ్ల వ్యవస్థలో పారదర్శకత, నాణ్యత, పోటీ సామర్థ్యం, వ్యాపార విస్తరణకు జీఈఎం కీలక వేదికగా నిలుస్తోందని టిక్కి ప్రతినిధులు తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా మరింత మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, యువ పారిశ్రామిక ఔత్సాహికులను అనుసంధానం చేసి, వారికి కొత్త వ్యాపార అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ అవగాహన ఒప్పందం వ్యాపార అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ప్రభుత్వ–ప్రైవేటు వ్యాపార అనుసంధానానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular