Homeఆంధ్రప్రదేశ్పోలవరంచింతూరులో ఇంధనంపై స్పష్టత కొరత లేదని ఐటిడిఏ హామీ

చింతూరులో ఇంధనంపై స్పష్టత కొరత లేదని ఐటిడిఏ హామీ

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 27:

చింతూరు డివిజన్‌లో ఇంధన (ఫ్యూయల్) సరఫరాపై ఎటువంటి కొరత లేదని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నొక్వాల్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అపోహలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఇంధన లభ్యతను పర్యవేక్షించేందుకు రంపచోడవరం జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే స్పందించి పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంధనానికి సంబంధించిన సమస్యలు లేదా సమాచారం కోసం ప్రజలు 7702831559 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు. ప్రస్తుతం డివిజన్ పరిధిలో ప్రజల అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్కడైనా తాత్కాలిక ఇబ్బందులు తలెత్తిన పక్షంలో సంబంధిత మండల తహసీల్దార్‌ను వెంటనే సంప్రదించాలని కోరారు. అధికార యంత్రాంగం ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోందని, అవసరానికి మించిన ఇంధనాన్ని నిల్వ చేయకుండా సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular