ePaper
Wednesday, April 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఉపాధి హామీలో ఫేషియల్ హాజరు రద్దుకు డిమాండ్: కలెక్టర్‌కు వినతి  

ఉపాధి హామీలో ఫేషియల్ హాజరు రద్దుకు డిమాండ్: కలెక్టర్‌కు వినతి  

📰 Generate e-Paper Clip

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 29: ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ (ముఖ గుర్తింపు హాజరు) విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ టి. నిశాంతికి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం జిల్లాలో అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానం కారణంగా ఉపాధి హామీ కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ముఖ గుర్తింపు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అనేక మంది కూలీల హాజరు నమోదు కాకుండా పోతుందని, ఫలితంగా వారు చేసిన పనికి వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అందువల్ల ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత హాజరు విధానాన్ని కొనసాగించాలని వారు కోరారు. అలాగే ఇప్పటివరకు పనిచేసి ఫేషియల్ అటెండెన్స్ నమోదు కాకపోయిన కూలీలకు కూడా తగిన వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.కూలీలకు రోజుకు కనీసం రూ.600 వేతనం ఇవ్వాలని, వేసవి తీవ్రత దృష్ట్యా పని ప్రదేశాల్లో మంచినీరు, టెంట్, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, అరకు వైసిపి మండల అధ్యక్షుడు స్వామి రామమూర్తి, హుకుంపేట వైసిపి మండల అధ్యక్షుడు పాంగి అనిల్, డుంబ్రిగూడ పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం, మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కామిడీ అశోక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular