Homeరాజకీయంమంత్రి లోకేష్ రాజీనామా కోరేముందు వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి

మంత్రి లోకేష్ రాజీనామా కోరేముందు వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి

జీవో నెం.3 రద్దైన రోజే గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీ రాజీనామా చేసి ఉంటే ప్రజలు హర్షించేవారు

మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలతో నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు

జనసేన నాయకుడు గొర్లె వీరవెంకట్ విమర్శలు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్ జూలై 29:మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరేముందు వైఎస్సార్సీపీ నాయకులు తమ పాలనలో చేసిన తప్పిదాలపై ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని జనసేన పార్టీ నాయకుడు గొర్లె వీరవెంకట్ అన్నారు.వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా, ఇప్పుడు మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు.డీఎస్సీపై గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైసీపీకి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు నుంచి చీవాట్లు ఎదురయ్యాయని పేర్కొన్నారు. నిజంగా అవకతవకలకు ఆధారాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని, ర్యాలీలు, ఆందోళనల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు.నీట్ పరీక్ష అంశంలో బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయాన్ని రాష్ట్ర డీఎస్సీతో ముడిపెట్టి వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించడం యువతకు ఇచ్చిన హామీల అమలుకు నిదర్శనమని అన్నారు.గిరిజనులపై వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, జీవో నంబర్–3 రద్దైన సమయంలో అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. అప్పట్లో మౌనం పాటించిన నాయకులు ఇప్పుడు గిరిజనులపై మొసలి కన్నీరు కార్చడం ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా సాగుతుండటాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు రాజకీయ విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజన ప్రజలు కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందిస్తారని, గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రజలు మద్దతుగా నిలుస్తారని గొర్లె వీరవెంకట్ విశ్వాసం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular