ePaper
Monday, May 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంనిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

నిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

📰 Generate e-Paper Clip

 

 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

గంగవరం /రాజవొమ్మంగి పెన్ పవర్, మే 4: నిరుపేదల ఆరోగ్య భద్రత కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తెలిపారు. సోమవారం రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవీపట్నం మండల పార్టీ అధ్యక్షుడు గోళ్ల చంటిబాబు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్నామని చెప్పారు. పోలవరం జిల్లా వ్యాప్తంగా గతంతో పోలిస్తే ఎక్కువమందికి ఎలాంటి తారతమ్యాలు లేకుండా సహాయం అందిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 24 మంది లబ్ధిదారులకు రూ. లక్షల విలువైన చెక్కులు మరియు ఎల్ ఓ సి లు పంపిణీ చేశారు. ప్రధాన లబ్ధిదారుల్లో కోమలి వీరబాబు (రూ.49,258), బొర్రా భారత్ (రూ.41,195), ముంజపు పుల్లయ్య (రూ.45,184), బసవ నిర్మలదేవి (రూ.43,356), వల్లూరి శ్రీను (రూ.52,546), గట్టి రామచంద్ర ప్రభు (రూ.40,795), కోట్ల కేశవరావు (రూ.56,984) తదితరులు ఉన్నారు. అలాగే అల్లంకి దీప్తి (రూ.2,92,467), పిన్నమనేని శ్రీ అపర్ణ నాగ సాయి (రూ.1,53,847)లకు అధిక మొత్తంలో సహాయం అందజేశారు.సహాయం అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవీపట్నం టీడీపీ మండల అధ్యక్షుడు గోళ్ల చంటిబాబు, సొసైటీ అధ్యక్షుడు మాగాపు బాబురావు, సీనియర్ నాయకుడు గణజాల తాతారావు, తెలుగు యువత అధ్యక్షుడు జొన్నల శ్రీనివాస్ కుమార్, క్లస్టర్ ఇంచార్జి ముచ్చు వీర వెంకట సత్యనారాయణ, ఐటీడీపీ కార్యదర్శి తాళ్లూరి కుటుంబరెడ్డి, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు రేలంగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular