Homeఆంధ్రప్రదేశ్పోలవరంమొక్కల పెంపకం తోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యం

మొక్కల పెంపకం తోనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యం

  • గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్ ,ఆగస్టు 9: మొక్కలను సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీఎల్‌ఎస్‌సీ కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, రంపచోడవరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మురళి గంగాధర రావు పేర్కొన్నారు.
    ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రంపచోడవరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి, మురళి గంగాధర రావు మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని వారు సూచించారు. తొలిత ఆమె కోర్టు ను పరిశీలించారు.
  • ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎం వి ఆర్ ప్రకాష్ కోర్టు భవన నిర్మాణ విషయమై ఆమె వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
    ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఏ జి పి సామయ్య ,రంపచోడవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల సత్యనారాయణ, కార్యదర్శి శివరంజని, సీనియర్ న్యాయవాదులు ఎం.వి.ఆర్. ప్రకాష్, కోల సత్యప్రసాద్, వై. శ్రీనివాస్, ఏ ఆర్ ఆర్ భగవాన్, గౌరీశంకర్, లక్ష్మీనారాయణ, మహిళా న్యాయవాది చక్రిక, కోర్టు సూపరింటెండెంట్ నాగభూషణం, కోర్టు సిబ్బంది పైడిరాజు, భార్గవి, గౌతమి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular